26న ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు

83చూసినవారు
26న ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు
మంచిర్యాల పట్టణ ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు ఈనెల 26న నిర్వహించనున్నట్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ ఆటో యూనియన్ పాత కమిటీ కాలపరిమితి ముగిసినందున ఎన్నికల్లో నూతన కార్యవర్గంను ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో ఆటో ఓటరు ఐడి గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్