మేదరిపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

57చూసినవారు
మేదరిపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం దొరల గాడిపై దండయాత్ర చేసిన వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం దండేపల్లి మండలం మేదరిపేట గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించి, అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, బుక్స్ పంపిణి చేశారు.