ఐలమ్మ ధిక్కారాన్ని విస్నూర్ దేశముఖ్ సహించలేక పోయాడు. ఆమెపై అక్రమ కేసులు బనాయించాడు. ఈ పోరాట క్రమంలో ఓ కొడుకును పోగొట్టుకుంది. మరో ఇద్దరు కొడుకులు, భర్త జైలు పాలయ్యారు. నల్లగొండలోని జైలులో వారిని కలిసేందుకు ఐలమ్మ ఒంటరిగా 100 కి.మీ. కాలినడకన వెళ్లి వచ్చేది. భర్త, కుమారులను సైతం అకారణంగా జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. అయినా ఐలమ్మ ధైర్యంగా పోరాడింది. ఎంతో మంది యువకులను చైతన్యపరచి కార్యకర్తలుగా, వాలంటీర్లుగా తయారు చేసింది.