పుచ్చలపల్లి సుందరయ్య, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలా దేవి, ప్రతాప్ రెడ్డి, వంటి మహా నేతలు పాలకుర్తికి వచ్చిపోతుండేవారు. వారికి అవసరమైన తిండి సమకూర్చడమే కాకుండా రజాకార్ల నుంచి కాపాడేది ఐలమ్మ. ఆమెను దొరలు హెచ్చరించినా వినలేదు. దీంతో ఐలమ్మను గడీకి పిలిపించుకొని... ‘నిన్ను ఇక్కడ చంపితే దిక్కెవరు’ అని ప్రశ్నించిన దొరకు ఖతర్నాక్ జవాబిచ్చింది. ‘నీకు ఒక్కడే కొడుకు, నాకు ఐదుగురు కొడుకులు. నన్ను చంపితే నా కొడుకులు నిన్ను బత్కనీయరు’ అని హెచ్చరించింది.