చెన్నూర్ పట్టణంలోని గోదావరి రోడ్డు నిర్మాణానికి సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు శంఖుస్థాపన చేశారు. డీఎంఎఫ్టీ నిధులు రూ. రెండు లక్షలు మంజూరు కావడంతో రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించినట్లు వారు తెలిపారు. పట్టణంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి పాల్గొన్నారు.