మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని లబ్దిదారులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. తన నివాసం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 338 మంది 1, 05, 08, 800 విలువ చేసే చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.