మంచిర్యాల: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

60చూసినవారు
మంచిర్యాల: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మంచిర్యాల మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మెరుగు పోషం ఇటీవల ఆకాల మరణం పొందారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్ గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి తూముల భీమయ్య ట్రస్ట్ ద్వారా రూ. ఐదు వేలు ఆర్థిక సహాయం అందించి ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్