సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో ఈ ఏడాది యాజమాన్యం అంకెల గారడి చేసిందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజారెడ్డి ఆరోపించారు. శ్రీరాంపూర్ లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సాధించిన మొత్తం లాభాలు రూ. 4701 కోట్లు అన్నారు. ఇందులో నుంచి ప్రభుత్వం ప్రకటించిన 33 శాతం వాటా కింద రూ 1551 కోట్లు కార్మికులకు పెంచాల్సింది ఉండగా, రూ 796 కోట్లు మాత్రమే పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.