ఈనెల నిర్వహిస్తున్న గ్రూప్-I పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు జిల్లా కేంద్రం లోని పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం బెల్లంపల్లి చెన్నూరు, లక్షటి పేట, పరిసర ప్రాంతాలకు ఉదయం ఆరు గంటల నుండి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.