36కు చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య

50చూసినవారు
36కు చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య
నారాయణ్‌పూర్‌-దంతెవాడ జిల్లా సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించగా.. అనధికారిక సమాచారం మేరకు.. క్రమేణా మృతుల సంఖ్య 14, 24, 30, 36.. ఇలా పెరుగుతూ వచ్చింది. ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించకపోయినా.. మావోయిస్టు పార్టీ కాయ్‌-6కు చెందిన శ్రేణులే మృతి చెందినట్లు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్