ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

150434చూసినవారు
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో శుక్రవారం రాత్రి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రూ. కోట్లలో నష్టం వాటిల్లినట్లు యజమాని శ్యామ్ తెలిపారు. లోపల అమోనియం సిలిండర్లు ఉండడంతో పేలిడు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళనలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్