పేపర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

62చూసినవారు
ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న పేపర్ గోదాంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేపర్ గోదాంలో మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 23 ఫైర్ ఇంజిన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భారీ మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్