ఓ కారు ప్రమాదం వీడియో చూస్తే.. వారికి ‘భూమ్మీద నూకలు ఇంకా మిగిలి ఉన్నాయని’ అనిపించక మానదు. రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి కారులో బికనేర్ బయల్దేరారు. మార్గమధ్యంలో కారు అదుపుతప్పి.. సెకన్ల వ్యవధిలోనే 8 సార్లు పల్టీలు కొట్టి షోరూమ్ గేటుపై బోల్తాపడింది. బయటపడిన వారు షోరూమ్ లోపలికి వెళ్లి ‘మాకు కొంచెం టీ ఇస్తారా’ అని అడిగారట. దీంతో ఆశ్చర్యపోవడం షోరూమ్ సిబ్బంది వంతైంది.