ఇండియన్ బంకులో పెట్రోల్ కల్తీ

2556చూసినవారు
ఇండియన్ బంకులో పెట్రోల్ కల్తీ
అల్లాదుర్గంలోని ఓ పెట్రోల్ బ్యాంకులో పెట్రోల్కు బదులు నీళ్లు రావడం కలకలం రేపింది. గురువారం బోడ్మట్ పల్లికి చెందిన వాహనాదారుడు ఈ బంకులో పెట్రోల్ పోయించుకొని వెళ్లగా కొద్దీ దూరంలో వాహనం ఆగిపోయింది. తీరా చూస్తే పెట్రోల్ కల్తీ అయినట్లు గమనించి బంకు నిర్వాహకుని నిలదీశారు. పెట్రోల్లో నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. న్యాయం కోసం ఆ వాహనాదారుడు అల్లాదుర్గం తహశీల్దార్, ఎస్సైలకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్