సంగారెడ్డి: అయ్యప్ప దేవాలయంలో మహా పడిపూజ
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారులోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శబరిమలలో జరిగే విధంగా తాంత్రిక రీతిలో అర్చకులు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీశైలం గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. అనంతరం పడి వెలిగించి అల్పాహారాన్ని అయ్యప్ప దీక్ష దారులకు అందించారు.