సిద్దిపేట: కారు నడిపిన కేసీఆర్... రంగంలోకి వస్తున్నారంటూ కామెంట్లు

82చూసినవారు
కేసీఆర్‌ స్వయంగా కారు నడిపిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. ఈ క్రమంలో త్వరలోనే కేసీఆర్‌ తెరపైకి వస్తారని ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ చిహ్నం 'కారు'ను గుర్తు చేస్తూ.. కేసీఆర్‌ కారు నడపడాన్ని ప్రస్తావిస్తూ.. ఇక భవిష్యత్తులో 'కారు' జోరు అందుకుంటుందంటూ కామెంట్లు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్