నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు చేపట్టామని గ్రామ సర్పంచ్ అనూష అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యగా గ్రామంలో దోమల నివారణకు స్ప్రే చేయించడం జరిగిందని గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.