రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ఈనెల 26వ తేదీన మెదక్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే రోహిత్ రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అంతకుముందు నర్సాపూర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.