చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

61చూసినవారు
చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగధనుల అమరత్వమేనని, ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించేతత్వం అలవడిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్