మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా చిలుమల సుహాసిని రెడ్డి మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. సమాజంలో ప్రతి ఒక్కరు విద్యావంతులు కావడానికి విద్యావంతమైన సమాజానికి ప్రధాన పాత్ర పోషించేది లైబ్రరీ లేనని తెలిపారు. మన లైబ్రరీ మన సరస్వతీ మాత అని గౌరవించాలన్నారు. మెదక్ జిల్లా లైబ్రరీ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.