మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి, పూజలు, అభిషేకాలు, హరతులను నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.