దుబ్బాక పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో శుక్రవారం రెంజుకి షోటోకన్ స్పోర్ట్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన పరీక్షల్లో సుమారు 100 మంది విద్యార్థులు ఈ పరీక్ష పోటీలలో పాల్గొన్నారని కరాటే మాస్టర్ దినకర్ తెలిపారు. ఏ పోటీలకు చీఫ్ ఎగ్జామినర్ గా కరాటే నగేష్ మాస్టర్ అబ్జర్వర్స్ గా నవీన్, రియాజ్ మాస్టార్లు పాల్గొన్నారని తెలిపారు. ఈ బెల్ట్ ఎగ్జామ్ లో బ్లాక్ బెల్ట్ సుమారు 50 మంది ఎగ్జామ్ ఇచ్చినట్లు వారు తెలిపారు. అందులో మెదక్ పట్టణానికి చెందిన హరి కీర్తి, కె.నవ చంద్ర తేజ గత ఐదు సంవత్సరాలుగా కరాటే మాస్టర్ దినకర్ మెదక్ గుల్షా క్లబ్ లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కాగా ఈ పోటీలకు ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరై మాట్లాడుతూ..నేటి సమాజంలో పిల్లలకు కరాటే నేర్పడం ద్వారా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఈ కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గణేష్ ,వైష్ణవి, నవ సూర్య తేజ, జియా, గౌస్, సాకేత్, ప్రణయ్ భరత్ సాయి, సాజిద్ ఆహాన్ మణికంఠ, ప్రణయ్ యాదవ్ లు అత్యంత ప్రతిభ కనబరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ మాస్టర్, మల్లేశం మాస్టర్, విద్యాసాగర్ మాస్టర్, తదితరులు పాల్గొన్నారు.