మెదక్: పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్తీసియా టెక్నీషియన్ కోర్సుల ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీందర్ శనివారం తెలిపారు. ఈనెల 20న దరఖాస్తులకు చివరి తేదీ అని తెలిపారు. మరిన్ని వివరాలకు మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సంప్రదించాలని సూచించారు.