మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసులు పెండింగ్ లో ఉండుటకు గల ముఖ్య కారణాలను ప్రస్తుతము అట్టి కేసుల యొక్క పరిస్థితులను తెలుసుకొని, చాలా కాలము నుండి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలన్నారు. ప్రతి అధికారి ఛాలెంజ్ గా తీసుకొని కేసులు చేదించాలని సూచించారు.