TG: ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అర్జున్ చారి

1071చూసినవారు
TG: ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అర్జున్ చారి
మెదక్ పట్టణానికి చెందిన చౌదరిమెట్టు అర్జున్ చారి అనే యువకుడు 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో SSC CHSL, రైల్వే గ్రూప్ -D, రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్, రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ప్రస్తుతం గ్రూప్ -4 ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం మెదక్ ఫారెస్ట్ బీట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. చదువు పట్ల క్రమశిక్షణ, పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అర్జున్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్