మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాతను మహిళా అఘోరి గురువారం దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయల సన్నిధికి చేరుకున్న అఘోరిని ఆలయ సిబ్బంది రాజగోపురం వద్ద స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజలు చేయగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు శంకర శర్మ, సిబ్బంది సూర్య శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.