నర్సాపూర్ నియోజకవర్గ పరిధి ఆయా మండలాల్లో ఆదివారం ఉదయం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గత రెండు వారాల నుండి ఎండలు దంచికొట్టడంతో సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. శనివారం రాత్రంతా కూడా భారీ వర్షం కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.