మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని రాయారావు చెరువులో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మంగళవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.