మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించి మాట మార్చిందని అన్నారు.