78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఏఆర్ఆర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.