మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని జర్నలిస్ట్ రాజు గురువారం నీటిలో మునిగి అకాల మరణం పట్ల కౌడిపల్లి యువ నాయకులు పోల నవీన్ కుటుంబానికి మనో ధైర్యాన్ని నింపి వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం 10, 000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పోల నవీన్ మాట్లాడుతూ ఇకపై వారి కుటుంబ సభ్యులకు ఏ అవసరం ఉన్న, ఎలాంటి ఇబ్బందులు ఉన్న మొహమాటం పడకుండా నా దృష్టికి తీసుకువస్తే నాకు తోచిన సహాయం చేస్తానన్నారు.