Oct 26, 2024, 09:10 IST/
శబరిమలకు వెళ్లే యాత్రికులు విమానాల్లో కొబ్బరికాయలను తీసుకెళ్లొచ్చు: BCAS
Oct 26, 2024, 09:10 IST
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు బ్యూరో ఆఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) శుభవార్త చెప్పింది. స్వామివారి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే యాత్రికులు.. ఇకపై విమానాల్లో వారి వెంట కొబ్బరికాయలను కూడా తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ సౌకర్యం వచ్చే ఏడాది జనవరి 20 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎక్స్-రే, ఎక్స్‌ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్, ఇతర పరీక్షల తర్వాత మాత్రమే కొబ్బరికాయలను విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తామని పేర్కొంది.