చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
నార్సింగి మండలం సంకాపూర్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీరయ్య అనే వ్యక్తి మరికొందరితో కలిసి మైసమ్మ కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. మంగళవారం మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.