ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి

83చూసినవారు
ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి
భానుర్ కి చెందిన అంజిరెడ్డి(39) బిడిఎల్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అంజిరెడ్డి ఆటో నడుపుకుంటూ పటాన్ చెరు వైపు వెళ్తుండగా బిడిఎల్ పరిశ్రమ దగ్గర యుటర్న్ తీసుకుంటుండగా శంకరపల్లి వైపు వస్తున్న బస్సు ఢీ కొట్టడంతో అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్