పటాన్చెరు: కన్న తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య
పాత కక్షలతో కన్న కొడుకును తండ్రి దారుణంగా హత్య చేసిన సంఘటన పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ సిఐ స్వామి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనంతరెడ్డి తన కుమారుడు వెంకట్ రెడ్డి (35)ని ఇంట్లో కర్రతో తలపై దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.