హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఈ మీటింగ్‌కి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌లతో పాటు 23 మంది సభ్యులు పాల్గొన్నారు.