మనం రోజు వినియోగించే బియ్యం, పప్పులు, నూనెలు, చక్కెరలను కొందరు కల్తీ చేస్తున్నట్లు వార్తల్లో చూస్తున్నాం. ఇదిలా ఉండగా తాజాగా ఉప్పు కూడా కల్తీ చేస్తున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. చెక్కర, ఉప్పులో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. 'మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్' అనే పేరిట జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. భారతీయ ఉప్పు, చక్కెర బ్రాండ్లలో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని ఆ అధ్యయనం పేర్కొంది. ఇవి శరీరంపై దుష్ప్రభావం చూపుతాయి.