బ్లూస్క్రీన్ ఎర్రర్‌పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఎక్స్‌లో పోస్టు చేసింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. కొన్ని PC లలో విండోస్-11, 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో మైక్రోసాఫ్ట్ ఈమేరకు స్పందించింది.