త్వరలో రూ.2 లక్షల రుణమాపీ కానీ రైతులందరికి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. పాలమూరు సభ ద్వారా మరో రూ.3000 కోట్లు ఇవ్వబోతున్నామని ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని వ్యాఖ్యానించారు. ఈనెల 30న మహబూబ్ నగర్ లో నిర్వహించబోయే రైతు సభ ద్వారా వివిధ కారణాల చేత రుణమాఫీ అందని రైతాంగానికి రుణమాఫీ చేస్తామని తెలిపారు.