గుడి నూనెలో పెట్రోల్ పోసిన దుండగుడు, పూజారికి గాయాలు (వీడియో)

535చూసినవారు
TG: నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నకిరేకల్‌లోని శివాలయానికి వచ్చిన ఓ దుండగుడు నూనె సీసాలో పెట్రోల్‌ను తీసుకొని వచ్చాడు. అది గమనించని పూజారి దీక్షితులు.. గర్భగుడిలో ఉన్న దీపంలో నూనెకు బదులు పెట్రోల్‌ను పోశారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అర్చకుడికి గాయాలయ్యాయి. గుడిలో ఉన్న భక్తులు.. హుటాహుటిన పూజారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, దుండగుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్