కొరియోగ్రాఫర్ జానీ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఇలాంటివి చేసినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆయన సినీ పరిశ్రమకు నల్లని మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మర్డర్ చేసినవారిని పోలీసులు ఎలా ట్రీట్ చేస్తారో జానీని అలాగే ట్రీట్ చేయాలన్నారు. ఆయన ఇంకా ఎంత మంది అమ్మాయిలను మతం మారాలని ఒత్తిడి చేశారో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.