సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే కొడుకు (వీడియో)

1894చూసినవారు
ఓ ఎమ్మెల్యే కొడుకు గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ నియోజకవర్గంలో జరిగింది. ఓ వ్యక్తిపై బైక్‌పై వెళ్తూ ఉన్నాడు. ఇంతలో అతడికి గుండెపోటు వచ్చింది. దాంతో అతను రోడ్డుపైనే కుప్పకూలాడు. అటుగా వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్ కుమారుడు గోవింద్ అది గమనించి వ్యక్తికి సీపీఆర్ చేశాడు. అంబులెన్స్‌ సహాయంతో అతడిని ఆస్పత్రికి తరలించాడు.

సంబంధిత పోస్ట్