బాల్కసుమన్ కి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్..!

58చూసినవారు
బాల్కసుమన్ కి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్..!
మహనీయుల సరసన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఏమిటనీ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బాల్క సుమన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శించారు. మహనీయుల సరసన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం వారిని అవమానించడమేనని సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిచాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి కౌంటర్ ట్వీట్‌తో కేసీఆర్ ఉన్న ఫోటో పంచుకున్నారు.