AP: మాజీ సీఎం జగన్ ఆదివారం బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. అనంతరం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అనుకూల విధానాన్ని నాయకులకు వివరించారు. ``మనం పోటీలో లేకపోయినా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఓడించాలి`` అని జగన్ పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా వైసీపీ నాయకులకు కేఎస్ లక్ష్మణరావుకి మద్దతుగా ఉండాలని జగన్ సూచించారు.