ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటుకు రూ.5వేలు?

62చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటుకు రూ.5వేలు?
TG: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిన్న ఆయా జిల్లాల్లో ప్రలోభాల పర్వం జోరుగా సాగినట్లు సమాచారం. పలువురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలవాలని ఓటర్లకు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే తెలిసిపోతుందని నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్