తెలంగాణలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జులై చివరి వారం వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం చురుకుగా కొనసాగుతుందన్నారు. అలాగే జులై 12 నుంచి 18 వరకు తూర్పు భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.