రాష్ట్రపతిని కలిసిన మోడీ (వీడియో)

50చూసినవారు
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటరీ నాయకుడిగా నరేంద్ర మోడీని కూటమిలోని పార్టీలు ఎన్నుకున్నాయి. ఈ క్రమంలో మోడీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. తనను NDA పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకుంటూ వివిధ పార్టీలు అందించిన మద్దతు లేఖను రాష్ట్రపతికి ఆయన అందజేశారు. జూన్ 9న ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడనుంది.

సంబంధిత పోస్ట్