కంగనా రనౌత్ వ్యాఖ్యలను అఖిల భారత కిసాన్ సభ(ఎఐకెఎస్) అధ్యక్షులు డాక్టర్ అశోక్ థావలే ఖండించారు. వ్యవసాయాన్ని కబళించాలనుకునే అంతర్గత - బాహ్య యాజమాన్యాలను మెప్పించేందుకే కంగనా ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 736 మంది రైతులు ప్రాణత్యాగం చేశారని తెలిపింది. స్వాతంత్య్ర పోరాటానికి ద్రోహం చేసి బ్రిటీష్ శక్తులకు తలవంచిన పచ్చి మితవాద మత శక్తులకు రైతాంగాన్ని, కార్మిక ప్రజలను ప్రశ్నించే నైతిక అధికారం లేదని ధావలే మండిపడ్డారు.