AP: బర్డ్ ఫ్లూ వ్యాప్తితో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దాంతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలు తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఫోన్: 0866 2472543, 94911 68699 నంబర్లకు కాల్ చేయవచ్చు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ చేయాలని సూచించింది.