‘ఒక్కసారైనా హోటల్‌లో టీ తాగి, మీ గ్లాసు మీరే కడుక్కున్నారా? మీ కులం వారికి ఇల్లు అద్దెకివ్వం అనే సమాధానం ఎప్పుడైనా విన్నారా? ఉన్నత పదవిలో వున్నా… కులం పేరుతో, అవమానాలకు గురయ్యారా? రంగును బట్టి జాతి వివక్షను ఎదుర్కొన్నారా? జెండర్ పేరుతో అణచివేతకు గురవుతున్నారా? మతం పేరుతో దాడులకు గురయ్యారా?’ అంటే.. దేశ వ్యాప్తంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. వివక్ష అనేది నయం చేయవలసిన వ్యాధి. విద్య, అవగాహన మాత్రమే దానికి విరుగుడు.